ఖానాపూర్​లో 4.80 కోట్లతో అభివృద్ధి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్​లో 4.80 కోట్లతో అభివృద్ధి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంలోని 12 వార్డుల్లో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.4.80 కోట్లతో పనులు చేసి పలు సమస్యలను పరిష్కరించామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ చిన్నం సత్యం అధ్యక్షతన మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్​లో ఖానాపూర్ పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. 

 అనంతరం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లోనూ అభివృద్ధి పనులు చేశామన్నారు. సంక్షేమ పథకాలు పారదర్శకంగా అమలయ్యేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామసభల్లో పేర్లు రానివారు ఆందోళన చెందవద్దని, మళ్లీ ఆర్జీలు ఇవ్వాలని సూచించారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయని, అపోహలు వీడాలన్నారు. అంతకుముందు ఖానాపూర్ మున్సిపాలిటీకి మంజూరైన తడి, పొడి చెత్త వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. 5,12 వార్డుల్లో ఏర్పాటు చేసిన 100 కేవీ విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. వేర్వేరుగా జరిగిన  కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ కావలి సంతోష్, కమిషనర్ మనోహర్, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, నాయకులు ఆమానల్లా ఖాన్, షబ్బీర్ పాషా, పి.సురేశ్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి

కడెం, వెలుగు: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఇందిరా మహిళశక్తి పథకంలో భాగంగా కడెం మండల కేంద్రంలో ఈడీఐఐ యాక్సెంచర్ ఆధ్వర్యంలో 26 రోజులపాటు శిక్షణ పొందిన మహిళలకు పీఎఫ్​సీ సెంటర్, సంచార వాహనాన్ని ఎమ్మెల్యే బొజ్జు పటేల్, డీఆర్డీవో పీడీ విజయలక్ష్మి ప్రారంభించారు. మహిళలు అని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఎంపీడీవో అరుణ, మాస్టర్ ట్రైనర్ దేవేందర్ నాయక్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.