రోగులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్​

ఉట్నూర్, వెలుగు : ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్​అన్నారు. బుధవారం ఆయన ఉట్నూర్​ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ అందుతున్న వైద్యం తీరును రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ ఆస్పత్రి గిరిజన, గిరిజనేతరులకు ఏంతో కీలకమైందని, ఇక్కడికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులు

సిబ్బందికి సూచించారు. సమయ పాలన పాటించాలన్నారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని, సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై గిరిజన గ్రామాల్లో ఆశ కార్యకర్తలు, ఏఎన్​ఎంలు అవగాహన కల్పించాలన్నారు. ఇన్​పేషెంట్లకు మెనూ ప్రకారం భోజనం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.