సూర్యాపేట జిల్లా కోదాడలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. కోదాడ నియోజకవర్గంలో అసంతృప్తి నేతలను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కలుస్తున్నారు. తనకు మద్దతుగా నిలవాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నాయకుడు చందర్ రావు ఇంటికి కోదాడ ఎమ్మెల్యే వెళ్లారు. కానీ ఎమ్మెల్యేని కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఆసక్తి చూపలేదు. దీంతో అరగంట పాటు చందర్ రావు ఇంట్లోనే బొల్లం మల్లయ్య కూర్చున్నారు.
మాజీ ఎమ్మెల్యే ఇంట్లోనే ఉండికూడా కలవకపోవడంతో మల్లయ్య యాదవ్ వెనుదిరిగారు. కోదాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు కేటాయించడన్ని మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, శశిధర్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.