ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలి : ఆశన్నగారి జీవన్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ శివారులోని ఆలూర్ బైపాస్ రోడ్డు వద్ద ఈనెల 3న శుక్రవారం  జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభన విజయవంతం చేయాలని  ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి  కోరారు. మంగళవారం వివిధ కుల సంఘాల నాయకులను కలిసి  సీఎం సభకు రావాలని ఆహ్వానించారు. అనంతరం సభా స్థలిలో  ఏర్పాట్లను పరిశీలించి నాయకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాలకు చెందిన నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. గురడి రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హాజరై ఆర్మూర్ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి మండలంలోని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు.

బీసీ, మైనారిటీలను సీఎంగా చేయగలదా?

నవీపేట్, వెలుగు : బీసీ, మైనార్టీలను సీఎంగా దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదని ఎమ్మెల్యే,  బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ అమీర్ అన్నారు. మండల కేంద్రంలో పార్టీ ఆఫీసు ఓపెన్ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి  సుదర్శన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు కాకుండా జిల్లాలో రెడ్డి వర్గానికి టికెట్లు ఇప్పించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ను మూడోసారి సీఎంను చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్ రావు, ఎంపీపీ శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్, పోశెట్టి, కార్యకర్తలు  పాల్గొన్నారు.