-
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
-
గుడి దగ్గర కట్టేది కాంప్లెక్స్ కాదు
-
పూజారులు ఉండేందుకు గది
-
భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర
హైదరాబాద్: భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, గెస్ట్ హౌస్ ను చెరువు శిఖం భూమిలోనే నిర్మించామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. తనపై భూకబ్జా కేసు నమోదైన నేపథ్యంలో ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రైవేటు కంపెనీ ఫిర్యాదు మేరకు తనపై కేసు నమోదు చేశారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు సమీపంలోనే వేంకటేశ్వరస్వామి ఆలయం ఉన్నదని చెప్పారు. దానికి తాను చైర్మన్ గా ఉన్నానని అన్నారు. గెస్ట్ హౌస్, క్యాంప్ ఆఫీస్ కు తప్పులేనప్పుడు ఆలయంలోని పూజారులు ఉండేందుకు సముదాయం నిర్మిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.