రంగు మారిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం!

భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి  గెలిచిన ఏకైక ఎమ్మెల్యే డాక్టర్​ తెల్లం వెంకట్రావు. ఎన్నికలకు ముందు బీఆర్​ఎస్ నుంచి కాంగ్రెస్​కు, ఆ తర్వాత 40 రోజుల్లోనే తిరిగి బీఆర్​ఎస్​కు వచ్చి పోటీ చేసి గెలిచారు. గెలిచాక ఆయన తిరిగి కాంగ్రెస్​కు వెళ్తారనే ప్రచారం జోరందుకుంది. అన్నట్లుగానే ఆయన కూడా బీఆర్​ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగాఉంటూ సీఎం రేవంత్​రెడ్డితో వరుసగా భేటీ అవుతూ వస్తున్నారు. 

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలుస్తున్నారు. జనవరి 26న  ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి చర్ల రోడ్డులోని క్యాంపు ఆఫీసులోకి వచ్చారు.  మొదట బీఆర్​ఎస్ ఫ్లెక్సీలు, మాజీ సీఎం కేసీఆర్ ఫొటోలతో క్యాంపు ఆఫీసు గులాబీమయంగా మార్చారు. కానీ అనూహ్యంగా శుక్రవారం ఫ్లెక్సీలు అన్నీ పోయి, క్యాంపు ఆఫీసు రంగు మారింది. ఇది సర్వత్రా చర్చకు దారి తీసింది. అభివృద్ధి కోసం సీఎంను కలుస్తున్నానని చెబుతూ వస్తున్న ఆయన సీఎం రేవంత్​రెడ్డిని కలిసిన తర్వాత క్యాంపు ఆఫీస్​ బోర్డు రంగు మారడం విశేషం.