మిర్యాలగూడ, వెలుగు : మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుంచి ప్రభుత్వ సామగ్రిని తీసుకెళ్లారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆర్అండ్‌బీ డీఈ గణేశ్ కుమార్, ఏఈ రాంబాబు చెప్పారు. మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
గత ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రెండు ప్లోర్లు, పెంట్ హౌస్‌తో క్యాంప్ ఆఫీస్ నిర్మించి అన్ని వసతులు కల్పించిందని చెప్పారు. ఆఫీస్‌ను స్వాధీనం చేసుకోవడంలో భాగంగానే మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఆఫీస్‌కు వచ్చారని వివరించారు. ఫర్నిచర్, ఇతర సామగ్రిని చార్జ్ లిస్ట్ ప్రకారం స్వాధీనం చేసుకొని సంతకం తీసుకున్నట్లు తెలిపారు. భాస్కరరావు ఆర్‌అండ్‌బీ స్ట్రక్చర్ లో లేనప్పటికీ క్యాంప్ ఆఫీసులో ఎలక్ట్రికల్ లిఫ్ట్, రేకుల షెడ్డు, ఇంటీరియర్ నిర్మాణం చేపట్టారన్నారు. వాటిని అలాగే వదిలేసి వెల్లారని చెప్పారు.