మల్లారెడ్డి పాలనకు కాలం చెల్లింది : తోటకూర వజ్రేశ్ యాదవ్‌‌‌‌

 శామీర్ పేట, వెలుగు: మంత్రి మల్లారెడ్డి పాలనకు మేడ్చల్‌‌‌‌లో  కాలం చెల్లిందని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్‌‌‌‌ సెగ్మెంట్ అభ్యర్థి వజ్రేశ్ యాదవ్‌‌‌‌ అన్నారు.  తూంకుంట మున్సిపాలిటీలో  సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్‌‌‌‌తో  కలిసి పర్యటించారు.  ఈ సందర్భంగా ఇంటింటికి  ప్రచారం నిర్వహించారు.  

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు.  దేవరయాంజల్ లోని దేవాదాయ భూముల్లో ఎవరూ కబ్జాల్లో ఉన్నారో కమిటీ వేసి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానన్నారు.  ఎక్కడెక్కడ కబ్జాలు చేశారో.. ఆ భూముల్ని విడిపించేందుకు కృషి   చేస్తానని చెప్పారు.  కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మహిపాల్ రెడ్డి, నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి, శామీర్ పేట అధ్యక్షుడు శంకర్ గౌడ్, కౌన్సిలర్లు  మధుసూదన్ రెడ్డి, పూజ భరత్ సింగ్, మాజీ జెడ్పీటీసీ బాలేష్ తదితరులు పాల్గొన్నారు.

 ALSO READ :  బీజేపీ, బీఆర్ఎస్ ​అభ్యర్థుల సవాళ్లతో .. నిజామాబాద్ అర్బన్​లో ఉద్రిక్తత