
మునిపల్లి, వెలుగు : ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు నచ్చాయని, అందుకే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని అందోల్ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని బుసారెడ్డిపల్లికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులుబీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, ట్రెడ్ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, సీనియర్ నాయకులు జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల్ యూత్ అధ్యక్షుడు ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.