వేములవాడ, వెలుగు: రాజన్న గుడికి వచ్చి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రాజకీయాలు మాట్లాడడం భావ్యం కాదని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. మంత్రి కేటీఆర్ పై, తనపై మాట్లాడిన మాటలను వెనక్కు తీసుకోవాలన్నారు. వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో ఆదివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అవగాహన లేకుండా వేములవాడ రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. దానికి బదులు దుబ్బాక ప్రజల కోసం మొక్కితే బాగుండేదన్నారు. మంత్రి కేటీఆర్ చాలాసార్లు కుటుంబసమేతంగా స్వామిని దర్శనం చేసుకున్నారని, ఆయనను నాస్తికుడు అనడం భావ్యం కాదన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయైనా రాజన్న ఆలయానికి వెచ్చించారా అని ప్రశ్నించారు. తన పౌరసత్వం విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను మాట్లాడలేనన్నారు. సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టీఆర్ఎస్పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, శ్రీనివాస్‌రావు, రామతీర్థపు రాజు, ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ మ్యాకల రవి తదితరులు పాల్గొన్నారు.