అమ్రాబాద్, వెలుగు: నల్లమల ప్రాంతాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. సోమవారం మన్ననూర్ లింగమయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్రాబాద్ మండలం సబ్ స్టేషన్ ఆవరణలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సెంటర్కు భూమిపూజ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో అమ్రాబాద్ కు ఈ సెంటర్ మంజూరైందని చెప్పారు. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలో5 సబ్ స్టేషన్లు ఉన్నాయని, వీటికి విద్యుత్ సప్లై కోసం సింగిల్ లైన్ ఉందని, మరో లైన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
శ్రీశైలం,- హైదరాబాద్ హైవేపై రూ.7,700 కోట్లతో మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరైందని తెలిపారు. భూత్పూర్ నుంచి మద్దిమడుగు వరకు రోడ్డు మంజూరైనట్లు చెప్పారు. మార్కెట్ వైస్ చైర్మన్ ఆర్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, ట్రాన్స్కో ఏడీ శ్రీనివాసులు, ఏఈ రమేశ్ నాయక్, ముబారక్, ఆంజనేయులు
పాల్గొన్నారు.