గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

అమ్రాబాద్, వెలుగు: గ్రామ కమిటీల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సూచించారు. బుధవారం పదర మండలం ఉడిమిళ్ల గ్రామంలో గ్రామ రైతు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బండలాగుడు పోటీలు నిర్వహించడం, గ్రామంలో అందరూ కలిసి సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ప్రభుత్వ సహకారంతో గ్రామాలను డెవలప్​ చేసుకోవాలని, సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కరిస్తానని తెలిపారు. బండలాగుడు పోటీల్లో తెలంగాణ, ఏపీ ప్రాంతాలకు చెందిన తూర్పు పొడ జాతి పశువులు పాల్గొన్నాయి. మొదటి బహుమతి మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయ చైర్మన్  రాములు నాయక్, రెండవ బహుమతి సీబీఎం ట్రస్ట్  చైర్ పర్సన్  చిక్కుడు అనురాధ, మూడో బహుమతి రంగాపూర్  మాజీ సర్పంచ్  లచ్చు నాయక్, లోక్యా అందించారు. కార్యక్రమంలో ఉమా మహేశ్వర ఆలయ చైర్మన్  బీరం మాధవ రెడ్డి అన్నదానం ఏర్పాటు చేశారు.