కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియగానే అన్ని గ్యారంటీలు అమలు : ఎమ్మెల్యే విజయరమణారావు

కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియగానే అన్ని గ్యారంటీలు అమలు : ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్, వెలుగు : ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను ఎన్నికల కోడ్ ముగియగానే పూర్తిస్థాయిలో అమలు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరుతూ బుధవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పనుల వద్దకు వెళ్లి కూలీలను ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ, జూన్ 15 నుంచి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. పెద్దపల్లిలో వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ లీడర్లు మినుపాల ప్రకాశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, అంతటి అన్నయ్యగౌడ్, దామోదర్ రావు, చిలుక సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పన్నాల రాములు, రాజలింగం, శ్రీనివాస్, దివ్య, చంద్రయ్య గౌడ్ పాల్గొన్నారు.