సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కానున్నాయని, వీటిని అర్హులైన పేదలకు కేటాయిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు. శుక్రవారం ఎలిగేడు, పెద్దపల్లి మండలాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం హనుమంతునిపేటలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు పారదర్శకంగా కేటాయిస్తామని, ఈ విషయంలో ఏ ఒక్కరికి పైసలు ఇవ్వొద్దని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ రేణుక, ఎంపీపీలు బి.స్రవంతి, టి.స్రవంతి, జడ్పీటీసీ రామ్మూర్తి, కాంగ్రెస్ లీడర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.