ఉమ్మడి నల్లగొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నకిరేకల్, వెలుగు : నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. పట్టణంలోని మినీ స్టేడియంలో బుధవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేడియంలో ప్యూరిఫైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాగునీటి వసతి కల్పించాలని, స్టేడియంలో మట్టి పోయించాలని సూచించారు. నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపాలిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని చెప్పారు. పట్టణంలో పారిశుద్ధ్య నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాచకొండ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మురారిశెట్టి కృష్ణమూర్తి ఉన్నారు. అంతకుముందు పట్టణంలోని 5, 6, 18 వార్డులకు సంబంధించిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. 

కేసులను వెనక్కి తీసుకోవాలి

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా హాలియా శివాలయం ధర్మకర్త పిట్టల శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ బుధవారం పట్టణంలో అయ్యప్ప, ఆంజనేయ, భవానీ, శివ మాలధారులు రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆలయంలో జరిగిన అక్రమాలపై నిలదీయడంతో కక్షసాధింపులో భాగంగా తమపై కేసులు పెట్టి, నోటీసులు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మాలధారులమంతా కాల్వలో దూకుతామని హెచ్చరించారు. మాలధారుల రాస్తారోకోతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్తంభించింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, సీఐ సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఘటనా స్థలానికి వచ్చి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వర్ర వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుందూరు వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, గౌని రాజారమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

రైస్‌‌ మిల్లుల కాలుష్యాన్ని నియంత్రించాలి

మిర్యాలగూడ, వెలుగు : రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లుల నుంచి వచ్చే వచ్చే పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియంత్రించాలంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని బాదలాపురం గ్రామస్తులు బుధవారం పక్కనే ఉన్న బాలాజీ పార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాయిల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిల్లు నుంచి వెలువడే వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, బూడిద, డస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండ్లలో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియంత్రించాలని ఆఫీసర్లను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. బాదలాపురంలో వైద్యసాయం అందుబాటులో ఉంచడంతో పాటు, వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరిస్తామని మిల్లు ఓనర్లు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

నేటి నుంచి ‘పోడు’ గ్రామసభలు

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో పోడు భూముల సర్వే ముగిసింది. దీంతో గురువారం నుంచి రెండు రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి అర్హులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. పైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్టును రెడీ చేసి డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లకు, అక్కడి నుంచి ఉన్నతాధికారులకు పంపించనున్నారు. 

అందుబాటులో 5 వేల ఎకరాలు.. అప్లికేషన్లు 20 వేల ఎకరాలకు

పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి హక్కు పత్రాలు ఇచ్చేందుకు గతంలో ఆఫీసర్లు అప్లికేషన్లు తీసుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని నాలుగు మండలాలు 42 గ్రామ పంచాయతీల పరిధిలోని 51 ఆవాసాలకు చెందిన 7,373 మంది గిరిజనులు అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నారు. పాలకీడు, చింతలపాలెం, మేళ్లచెరువు, మఠంపల్లి మండలాల్లో గిరిజనులతో పాటు గిరిజనేతరులు సైతం పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. జిల్లాలో 5 వేల ఎకరాల పోడు భూములు మాత్రం అందుబాటులో ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతుండగా గిరిజనుల నుంచి మాత్రం 20,418 ఎకరాలకు అప్లికేషన్లు వచ్చాయి. ఇటీవల సర్వే పూర్తి చేసిన ఆఫీసర్లు ఒకే ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నట్లు గుర్తించారు.

నేటి నుంచి గ్రామసభలు

పోడు భూముల అర్హులను గుర్తించేందుకు గురువారం నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు. 2005 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు సాగులో ఉన్న వారు, ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నోటీసులు, నమోదైన కేసులు, సర్వే పత్రాలను బట్టి అర్హులను గుర్తింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్టీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

రేపు మస్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నారసింహుడి కల్యాణం

యాదగిరిగుట్ట, వెలుగు :యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18న ఓమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజధాని మస్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకోసం యాదగిరిగుట్ట నుంచి ప్రధానార్చకుడు నల్లంథీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లక్ష్మీనర్సింహాచార్యులు, సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొమ్మాట సురేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, అర్చకులు నర్సింహమూర్తి, వేదపండితుడు సిద్ధేశ్వరాచార్యులు బుధవారం మస్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బయలుదేరారు. మస్కట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్వామివారి కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని ఈవో గీతారెడ్డి తెలిపారు.

నేడు బీజేపీ పార్లమెంటరీ కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భువనగిరిలో గురువారం బీజేపీ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోషి హాజరవుతున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ.శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు చెప్పారు.

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కోర్టు మంజూరు

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కోర్టు మంజూరైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ, శాసనసభ వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి నరసింగరావు బుధవారం ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేస్తూ లాయర్లు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కోర్టు మంజూరు కోసం కృషి చేసిన మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు రామిరెడ్డికి థాంక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు.