ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్ (నకిరేకల్), వెలుగు : అయిటి పాముల లిఫ్ట్ పనులు 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో రూ.100 కోట్లతో నిర్మించనున్న లిఫ్ట్, కెనాల్ పనులను శుక్రవారం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ లిఫ్ట్ పూర్తయితే 8 వేల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. 15 రోజుల్లోనే మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి పనులు ప్రారంభిస్తారని చెప్పారు.