హైడ్రా కూల్చివేతలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు : ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌

హైడ్రా కూల్చివేతలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు : ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌
  • బీఆర్‌‌‌‌ఎస్‌‌పై ఎమ్మెల్యే  దానం నాగేందర్‌‌‌‌ ఫైర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : హైడ్రా కూల్చివేతలపై ప్రజలను బీర్‌‌‌‌ఎస్‌‌ పార్టీ తప్పుదోవ పట్టిస్తూ రెచ్చగొడుతోందని ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌ ఫైర్‌‌‌‌ అయ్యారు. మాజీ మంత్రి హరీశ్‌‌ రావు చీప్‌‌ పాలిటిక్స్‌‌ చేస్తున్నారని, హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్‌‌‌‌ గుర్తు పెట్టుకోమనడం సరికాదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో చిట్‌‌చాట్‌‌గా మాట్లాడారు. హైడ్రా కూల్చివేతలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్‌‌ రెడ్డిని కోరుతానని చెప్పారు.

హైడ్రా కాస్త ముందే మేల్కొని ఉంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. స్లమ్‌‌ల జోలికి వెళ్లకూడదని హైడ్రాకు తాను ముందే చెప్పానన్నారు. జల విహార్‌‌, ఐమాక్స్‌‌ లాంటివి చాలా ఉన్నాయని, పేదల ఇండ్లను కూల్చడం సరికాదన్నారు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు.  

ప్రజలకు అవగాహన కల్పించాలి..

కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అవ గాహన కల్పించాలని దానం నాగేందర్‌‌‌‌ పే ర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు కౌన్సెలింగ్ ఇచ్చి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఖాళీ చేయి స్తే బాగుండేదన్నారు. ఇండ్లకు రెడ్‌‌ మార్క్‌‌, సర్వే తొందరపాటు చర్యలేనన్నారు.