కోఠి మార్కెట్​లో ఎమ్మెల్యే దానం పర్యటన

కోఠి మార్కెట్​లో ఎమ్మెల్యే దానం పర్యటన

కోఠి మార్కెట్లో ఎమ్మెల్యే దానం నాగేందర్​ పర్యటించారు.  ఎమ్మెల్యేతో పాటు నారాయణగూడ ట్రాఫిక్​ ఇన్స్​పెక్టర్లు సత్యనారాయణ,  హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్   ఉన్నారు.  కోఠి మార్కెట్లో సెకండ్​ హ్యాండ్​ బైక్​ లను విక్రయించే షాపుల యజమానులతో మాట్లాడారు. షాపుల ఎదుటపార్కింగ్​ చేసిన బైక్​ లకు పోలీసులు చలాన్​ లు విధిస్తున్నారని ఎమ్మెల్యేకు షాపుల యజమానులు తెలిపారు. 

ఫుట్ పాత్ లపై బైక్స్ పెట్టడం వల్ల పాదచారులకు , వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని... ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలుగుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యే దానం నాగేందర్​ కు వివరించారు.  కింగ్​ కోఠి స్కూల్స్​ జోన్స్​ ఏరియా కావడంతో ట్రాఫిక్​ ప్రోబ్లం ఉందని.. అందుకోసమే చలాన్​లు విధిస్తున్నామన్నారు.  ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వ్యాపారం చేసుకోవాలన్నారు.  షాపుల ముందు బైక్స్ పెట్టకుండా చూడాలని... షాపు పరిధి లోనే బైక్స్ పెట్టుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించి... ట్రాఫిక్ ను నియంత్రించాలని షాపు యజమానులకు ఎమ్మెల్యే  దానం నాగేందర్ సూచించారు.