పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోను.. హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం

పేదలకు అన్యాయం జరిగితే ఊరుకోను.. హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం

 హైదరాబాద్ లో కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదన్నారు దానం.  ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మీ , షాది ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. ఈ సందర్బంగా మాట్లాడియన ఆయన..   అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు... అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు. ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలని సూచించారు.  

అధికారులకు ఓల్డ్ సిటీలో అక్రమ నిర్మాణాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు ఎమ్మెల్యే దానం. కూల్చివేతలు  మొదలు పెడితే ముందు ఓల్డ్ సిటీ నుంచే మొదలు పెట్టాలన్నారు.  హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని... హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేనన్నారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా  కూల్చివేతలు చేస్తున్నారని అన్నారు.  అధికారులు చేసే పనుల వల్ల తాము ప్రజల మధ్య తిరగలేకపోతున్నామని చెప్పారు.అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు.

హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది , దానిని స్వాగతిస్తున్నానని దానం అన్నారు.  మూసి ప్రక్షాళన చేయాలనేది  సీఎం ఆకాంక్ష.  కాంగ్రెస్ ప్రభుత్వం మూసి సుందరికరణ చేసి , పర్యాటక కేంద్రంగా మారుస్తుందన్నారు ఎమ్మెల్యే దానం.