హైడ్రా కూల్చివేతలపై MLA దానం సంచలన వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపై MLA దానం సంచలన వ్యాఖ్యలు

హైడ్రా కూల్చివేతలపైన ఆదివారం MLA దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదని అన్నారు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మా ట్లాడుతూ.. ‘మురికవాడల జోలికి వెళ్లొద్దని హైడ్రాకు ముందే సూచించా. పేదల ఇండ్లు కూలగొట్టడం సమంజసం కాదు. కూలగొట్టడానికి ఐమ్యాక్స్, జలవిహార్ లాంటివి చాలా ఉన్నయ్. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఇండ్లు కూలగొట్టాల్సింది. ఇండ్లకు మార్కింగ్ చేయడం తొందరపాటు చర్య. ఈ అంశంపై సీఎం రేవంత్ కి లేఖ రాస్త’ అని దానం తెలిపారు.

అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్న KCR వ్యాఖ్యలను మార్చిపోయారా అని ప్రశ్నించారు. పేదల విషయంలో హైడ్రా ఆలోచించాలన్నారు దానం నాగేందర్. హైడ్రా కూల్చివేతలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని చెప్పారు. హైడ్రాపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు. అక్రమ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. గతంలో కూడా ఎమ్మెల్యే దానం హైడ్రా కమిషనర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ALSO READ | రైతులకు న్యాయం చేస్తాం.. పేదల సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి పొంగులేటి