రిజిస్ట్రేషన్ల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

రిజిస్ట్రేషన్ల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సెషన్‎లో భాగంగా జీరో అవర్‎లో ఈ సమస్యను ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 

‘నగర శివారు ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరం కలిసి ఈ విషయాన్ని కేటీఆర్ దృష్టికి గతంలోనే తీసుకొచ్చాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తాం అని అన్నారు. నా నియోజకవర్గంలో రిజిస్టేషన్ల సమస్య వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. హుడా అనుమతి ఇవ్వడంతోనే కాలనీలు వెలిశాయి. అప్పటి ప్రభుత్వం అన్ని అనుమతులు 1980లో ఇచ్చి.. ఆ తర్వాత 1996లో అకస్మాత్తుగా రద్దు చేశారు. అనంతరం 2008లో రిజిస్ట్రేషన్స్ మరియు భవన నిర్మాణ అనుమతులు బంద్ చేశారు. లే అవుట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వ అనుమతులు లేవని అధికారులు అడ్డుకుంటున్నారు. ముఖ్యమంత్రి మరోసారి ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి.. ఈ రిజిస్టేషన్ల సమస్యను పరిష్కరించాలి’ అని సుధీర్ రెడ్డి అన్నారు.

For More News..

ఈటల రాజేందర్‎కు పోటీగా ఇల్లందుల రాజేందర్‎తో నామినేషన్!

హుజురాబాద్ బైపోల్ వార్.. బీజేపీ స్టార్ క్యాంపైనర్లు వీళ్ళే

ఈటలను గెలిపిస్తే గ్యాస్ ధర రూ.1500 చేస్తరు