- సీఎం రేవంత్‌ను కోరిన ఎమ్మెల్యే ధన్పాల్
నిజామాబాద్, వెలుగు: ఇందూర్ నగరం అభివృద్ధి పనులకు రూ.10 కోట్ల స్పెషల్‌డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్డీపీ) ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ కోరారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు.
నగర రోడ్ల అధ్వాన్న దుస్థితి, తాగునీరు. డ్రైనేజీ సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇష్యూను చర్చించానని సీఎం పాజిటివ్‌గా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.