నిజామాబాద్అర్బన్, వెలుగు : పారిశుధ్య పనులను నిర్లక్ష్యం చేయొద్దని ఎమ్మెల్యే ధన్పాల్సూర్యనారాయణ కార్మికులకు సూచించారు. మంగళవారం నగరంలోని 1వ వార్డులో ఆయన పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.
కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. అనంతరం కార్మికుల హాజరు శాతం తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు, పారిశుధ్య కార్మికులు తదితరులు ఉన్నారు.