పరకాల, వెలుగు : హన్మకొండ జిల్లా నడికూడ మండలంలోని చౌటుపర్తి, ముస్త్యాలపల్లి, ధర్మారం గ్రామాల్లో కొత్తగా కట్టిన గ్రామ పంచాయతీ భవనాలను గురువారం ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రారంభించారు. అలాగే ముస్త్యాలపల్లిలో బస్ షెల్టర్‌తో పాటు, నడికూడ మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్‌ను ప్రారంభించారు.
అనంతరం ఈ నెల 9న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నూతన మున్సిపాలిటీ బిల్డింగ్‌ను పరిశీలించి ఏర్పాట్లపై ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట చైర్‌పర్సన్ సోదా అనిత రామకృష్ణ, వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు గూడెం కృష్ణమూర్తి, బొట్ల సంధ్య, గోల్కొండ ఉమ ఉన్నారు.