ఓటర్లను ఆకట్టుకునేందుకు లీడర్లు చేస్తున్న హడా వుడి అంతా ఇంతా కాదు. శంకుస్థాపనలు, శిలాఫలకాలు అంటూ కేడర్‌ను వెంటేసుకొని జనంలో తిరుగుతున్నరు. కొందరైతే టెంపరరీ శిలాఫకాలు వేసి, ఇక పని అయిపోందన్నంతగా ప్రచారం చేసుకుంటున్నరు. తీరా.. ఆ ప్రోగ్రామ్ అయిపోంగనే ఆ టెంపరరీ శిలాఫకాలను కేడర్ తీస్కపోతున్నరు. దీన్ని చూసి జనం ముక్కునవేలేసుకుంటున్నరు. ఇలాంటి సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.
ఇటీవల ఒకటో వార్డు పరిధిలోని రాజీవ్ నగర్లో రూ.2 కోట్లతో ఆధునిక ధోబీ ఘాట్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే దివాకర్ రావు భూమి పూజ చేశారు. టెంపరరీగా ఫౌండేషన్ స్టోన్స్ తయారు చేయించి ఐరన్ స్టాండ్ పై ఉంచారు. కార్యక్రమం పూర్తయి ఎటోళ్లటు పోగానే వాటిని ఆటోలో వేసుకుని తీసుకుపోయారు. ఇప్పుడు అక్కడ దోబీఘాట్‌కు భూమిపూజ చేసిన ఆనవా ళ్లు లేకుండాపోయాయి. ధోబీ ఘాట్‌కు అవసరమైన 20 గుంటల స్థలాన్ని మార్కింగ్ కూడా చేయలేదు.