కడెం ప్రాజెక్ట్ ఆయకట్టు..రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందవద్దు

కడెం, వెలుగు : సాగునీటి సరఫరా విషయంలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని రైతుల ఎలాంటి ఆందోళనకు గురికావద్దని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. కడెం ఎంపీపీ ఆంథోని అలెగ్జాండర్ తో పాటు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన గురువారం కడెం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల ప్రాజెక్టు 15 వరద గేటు వద్ద రోప్ తెగిపోయి నీరు వృథాగా పోతుండటంతో.. రోప్ కాంటివేటర్ రిపేర్లపై నీటిపారుదల శాఖ ఎస్ఈ సుశీల్ కుమార్

ఈఈ రాథోడ్ విఠల్ తో చర్చించారు. రిపేర్లు వేగంగా పూర్తిచేసి నీటి వృథాను అరికట్టాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కడం ప్రాజెక్ట్ రిపేర్ల విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రబీ సీజన్​లో కూడా ఆయకట్టు పంటలకు సాగునీరు అందించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.