- నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్లో రూ.40 కోట్లతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలను నిర్మించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెల్లడించారు. నర్సంపేటలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, 20 రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, పనులు ప్రారంభిస్తామన్నారు. ద్వారకపేట రావి చెట్ల నుంచి సుభాష్విగ్రహం మీదుగా నెహ్రూ పార్కు వరకు
గెస్ట్‌హౌజ్ నుంచి మహబూబాబాద్ బైపాస్ రోడ్ వరకు డబుల్ రోడ్‌ను విస్తరించేందుకు రూ.20 కోట్ల డీపీఆర్‌ను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. నర్సంపేట టౌన్‌కు శాశ్వతంగా నీటి సమస్యను తొలగించేందుకు అశోక్‌నగర్ రిజర్వాయర్‌ను ఆరునెలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
Also read : ట్రాన్స్ కో ఏఈ అవినీతిపై విచారణ
రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ప్రెస్ మీట్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పీసీసీ మెంబర్ పెండెం రామానంద్, తోకల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.