నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని కమ్మపల్లి, ఇటుకాలపల్లి, నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కమ్మపల్లి, ఇటుకాలపల్లి గ్రామాల్లో నాబార్డు సహకారంతో డీసీసీ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్మించిన 300ల మెట్రిక్ టన్నుల గోదాములను ప్రారంభించారు. నర్సంపేటలోని పీఏసీఎస్ ఆవరణలో నిర్మించే నూతన షాపింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు.
కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి నీరజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ తోట శ్రీనివాస్, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి, టీపీసీసీ మెంబర్లు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నాయకులు పాల్గొన్నారు.