నర్సంపేట, వెలుగు : వేసవిలో తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని వరమ్మతోట బావి, ఫిల్టర్‌బెడ్, నల్లాల బావి, పాకాల వాగు పరివాహక ప్రాంతాలను ఆదివారం ఎమ్మెల్యే దొంతి పరిశీలించారు. బావులతో పాటు ఫిల్టర్ బెడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని సూచించారు.
నర్సంపేట టౌన్ ప్రజలకు తాగు నీటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ ఆఫీసర్లపైనే ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నాయకులు తక్కళ్లపల్లి రవీందర్రావు, పెండెం రామానంద్, కౌన్సిలర్ వేముల సాంబయ్య, తుమ్మలపల్లి సందీప్ తదితరులు ఉన్నారు.