పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : భూపతిరెడ్డి

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : భూపతిరెడ్డి
  • రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

నిజామాబాద్, వెలుగు : రెండు రోజుల క్రితం రూరల్​ సెగ్మెంట్​లో కురిసిన వడగండ్లు, ఆకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి కోరారు. సోమవారం అసెంబ్లీలో ఈ అంశాన్ని ఆయన లేవనెత్తగా అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వర్​రావు సానుకూలంగా స్పందిస్తూ నష్టపోయిన ప్రతి ఎకరం పంటకు రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఎర్ర జొన్న రైతులు, మంచిప్ప ప్రాజెక్టు కోసం ఉద్యమించిన టైంలో రైతులపై నమోదైన పోలీస్​ కేసులను ఎత్తేయాలని కోరారు.  సెగ్మెంట్​లో వ్యవసాయ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి విజ్ఞప్తి చేశారు.