- ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
కల్లూరు, వెలుగు : పేదల సొంతింటి కలలను సాకారం చేసేందుకు అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘవ దయానంద్ స్పష్టం చేశారు. సోమవారం చెన్నూరు సొసైటీ ఆధ్వర్యంలో చంద్రుపట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన సన్న రకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రాగమయి, పలువురు రెవెన్యూ అగ్రికల్చర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆధ్వర్యంలో రైతులకు సంక్షేమ పథకాలు, రుణమాఫీ అమలు చేస్తామని చెప్పారు.
కార్యక్రమం లో ఆర్డీవో ఎల్ రాజేంద్ర గౌడ్, తాసీల్దార్ పోలీస్ సాంబశివుడు, మండల అగ్రికల్చరల్ ఆఫీసర్ మాదాభత్తుల రూప, ఎంపీడీవో దయగలచంద్రశేఖర్ , స్పెషలాఫీసర్ సునీత, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ కుక్క నాగమ్మ యాలాద్రి, చెన్నూరు సొసైటీ సీఈవో దేవరపల్లి మురళీకృష్ణ, సొసైటీ డైరెక్టర్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు పాల్గొన్నారు.