సత్తుపల్లి, వెలుగు : ఏరువాక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ఎడ్లకు పూజ చేసి నాగలితో పొలం దున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి ఆమె మాట్లాడారు. ప్రతీ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమనాడు ఏరువాక పున్నమినీ రైతులందరూ జరుపుకొంటారని తెలిపారు. రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం రైతులకు పండుగగా మారాలని ఆకాంక్షించారు.
అనంతరం ఉత్తమ రైతులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ నరసింహారావు, ఏవో ఎరపతినేని శ్రీనివాసరావు, నాయకులు దొడ్డ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ పాకలపాటి శ్రీనివాసరావు, చల్లగుళ్ల నరసింహారావు, ఇమ్మనేని ప్రసాద్, దొడ్డాకుల గోపాలరావు, గాదె చెన్నకేశవరావు, సామేలు, కమల్ పాషా, రైతులు పాల్గొన్నారు.