ఫుడ్ పార్క్ లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి : మట్టా రాగమయి

ఫుడ్ పార్క్ లో ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి : మట్టా రాగమయి
  • ఎమ్మెల్యే మట్టా రాగమయి 

సత్తుపల్లి, వెలుగు :  ఫుడ్​ పార్క్ లో నాన్ టెక్నికల్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అధికారులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని బుగ్గపాడులోని ఫుడ్ పార్క్ ను కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తో కలిసి ఆమె సందర్శించారు. ఫుడ్ పార్కు లో అవసరమైన సదుపాయాలు, జరుగుతున్న పనులను అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ మహేశ్వర్, జే.ఈ శివ, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, కాంగ్రెస్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, సుబ్బారెడ్డి, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

పరిహారంపై కలెక్టర్ తో చర్చ

సింగరేణి ఓపెన్ కాస్ట్ నిర్వహణ కోసం కిష్టారం గ్రామ పరిధిలో కొత్తగా సేకరించనున్న సుమారు 36 ఎకరాల భూమికి గాను ఒక్కో ఎకరానికి రూ.30 లక్షల చొప్పున ప్యాకేజీ చెల్లించాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి, పార్టీ స్టేట్​ లీడర్​ మట్టా దయానంద్ కలిసి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ను కోరారు. 

ఖమ్మం కలెక్టరేట్ లో ఆయనను శుక్రవారం వారు కలిశారు. భూ నిర్వాసితుల పరిహారం పాటు జగన్నాధపురం ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో పెండింగ్​ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలలు, పంచాయతీ ఆఫీసులతో పాటు శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు.