అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

సత్తుపల్లి, వెలుగు :  పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి  ప్రాంగణంలో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి గురువారం భూమి పూజ చేశారు. అనంతరం 4వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సత్తుపల్లి మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. పనులు చేయకుండానే మున్సిపాలిటీలో డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు.

రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ నియోజకవర్గం లో అన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మాజీ కౌన్సిలర్లు తోట సుజాల రాణి, కంటే నాగలక్ష్మి, గ్రాండ్ మౌలాలి, దూదిపాల రాంబాబు, నాగుల్ మీరా, పద్మ జ్యోతి, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, దొడ్డా శ్రీను, చల్లగుళ్ల కృష్ణారావు, ఇమ్మనేని ప్రసాద్ రావు, కమల్ పాషా తదితరులు పాల్గొన్నారు.