మహబూబాబాద్ అర్బన్, వెలుగు : మత్స్యకారులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కంబాల చెరువులో ఉచిత చేప పిల్లలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంబాల చెరువులో రూ.లక్షా 63వేలు విలువ చేసే చేపపిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు.
మహబూబాబాద్నియోజకవర్గంలోని 35 చెరువులకు రూ.71 లక్షల 48 వేలు విలువ చేసే చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్ గోపాలపురం పెద్దమ్మతల్లి దేవాలయానికి కంపౌండ్వాల్ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఫిషరీస్ సొసైటీ అధ్యక్షుడు సింగని అశోక్, జిల్లా సొసైటీల అధ్యక్షుడు కొత్తూరి రమేశ్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్రెడ్డి, డీఎఫ్వో వీరన్న, సొసైటీ కార్యదర్శి దశరథం, డైరెక్టర్లు, కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు.