![క్రీడల్లో యువత సత్తా చాటాలి : సంజయ్‌కుమార్](https://static.v6velugu.com/uploads/2025/02/mla-dr-sanjay-kumar-inaugurates-kabaddi-competition-emphasizes-youth-participation-in-sports_ZN0M75HgWt.jpg)
- ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్, వెలుగు: క్రీడల్లో యువత సత్తా చాటాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ భీమేశ్వర ఆలయ జాతర ఉత్సవాలను పురస్కరించుకొని సంఘమిత్ర యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి క్రీడాకారుల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. కబడ్డీ పోటీలో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, సింగిల్‌విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, లీడర్లు అచ్యుత్‌రావు, శ్రీధర్‌రెడ్డి, మోర రామ్మూర్తి, మహేశ్‌గౌడ్, చంద్రతేజ, సత్యనారాయణ పాల్గొన్నారు.