
- బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ సూరిబాబు
బెల్లంపల్లి, వెలుగు: తన ఇమేజ్ డ్యామేజ్చేస్తూ.. ప్రజలు ఎంతో అభిమానంతో ఇచ్చిన రెండు గుంటల భూమిని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కబ్జా చేయిస్తున్నారని టీపీసీసీ సెక్రెటరీ, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు ఆరోపించారు. కబ్జాకు ఆఫీసర్లు సహకరిస్తున్నారని చెప్పారు. భూమి విషయంలో తనకి న్యాయం చేయకపోతే భార్యతో కలిసి ఆర్డీఓ ఆఫీస్ ముందు పెట్రోల్పోసుకుని సూసైడ్ చేసుకుంటానని హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో నీతి, నిజాయితీతో బతికిన తనకి గతంలో రడగంబాల బస్తీ వాసులు రెండు గుంటల భూమిని ఇచ్చారని చెప్పారు. దానిపై ఎమ్మెల్యే కన్ను పడిందని ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకుంటే బాధ్యత ఎమ్మెల్యేదే అని స్పష్టం చేశారు.