ఎమ్మెల్సీ ఓటర్ లిస్టులో ఈటల పేరు గల్లంతు

రాష్ట్రవ్యాప్తంగా 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఆయా జిల్లాల్లో ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా.. కరీంనగర్ జిల్లాలో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ లో ఆయన పేరు నమోదు కాలేదు.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటర్ లిస్ట్ సవరణ చేసే సమయానికి ఈటల ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోవడంతో ఆయన పేరు లిస్ట్ లో నమోదు కాలేదని తెలుస్తోంది.