గౌరవెళ్లి ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి

గౌరవెళ్లి ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని ప్రతి ఒక్కరికి  డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలన్నారు  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 18 ఏళ్లు నిండిన యువకులకు 8 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ భూముల అభివృద్ధి కోసం ప్రభుత్వం రైతులకు డబ్బులు చెల్లించాలన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గౌరవెళ్లి ప్రాజెక్టు నిర్వాసితులను కలిశారు ఈటల. ఆ తర్వాత మాట్లాడారు.  లక్షలాది మందికి అవకాశం కల్పించే  గూడటిపల్లి ప్రజలు న్యాయమైన డిమాండ్ల కోసం డిమాండ్ చేస్తే పోలీసులతో దౌర్జన్యం చేస్తూ రక్తపాతం సృష్టించడం దుర్మార్గ మైన చర్య అని అన్నారు. రైతులు ఏమైనా టెర్రరిస్టులా ..దీక్ష చేస్తూ ఉంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దారుణమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని గ్రహించు కోవాలన్న ఈటల..పూర్తిస్థాయి పరిహారం అందించే వరకు రైతుల పక్షాన బీజేపీ  అండగా ఉంటుందని తెలిపారు.

 

 మరిన్ని వార్తల కోసం...

 

ప్రపంచంలోని గొప్ప నేతల్లో ఒకరు వాజ్​పేయి