అప్పులు తీరుస్తూనే పథకాల అమలు : ఎమ్మెల్యే జి మధుసూదన్​

అప్పులు తీరుస్తూనే పథకాల అమలు : ఎమ్మెల్యే జి మధుసూదన్​

కొత్తకోట, వెలుగు : గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్​రెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఓ గార్డెన్​లో మహాలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు రూ.500కే గ్యాస్​ సిలిండర్​ ప్రొసీడింగ్​ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగులు బడ్జెట్​ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు. వాళ్లు చేసిన అప్పులకు నెలకు రూ.5 వేల కోట్లు వడ్డీ కడుతూనే 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. 

రూ.2 లక్షల రూణమాఫీ సాంకేతిక కారణాలతో నిలిచిపోతే.. అధికారంలో ఉన్నప్పుడు రూణమాఫీ చేయని బీఆర్ఎస్​ నేతలు చిల్లర రాజకీయం చేస్తున్నారన్నారు. అక్టోబర్​ 2 నుంచి అర్హులకు రేషన్​ కార్డులు ఇస్తామని, దసరా నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. అనంతరం పట్టణానికి చెందిన 74 మందికి షాదీ ముబారక్, 10 మందికి  రైతు బీమా చెక్కులను అందజేశారు. 

మార్కెట్  చైర్మన్​ పల్లెపాగ ప్రశాంత్, వేముల శ్రీనివాస్​ రెడ్డి, బోయోజ్, శ్రీను, బీచుపల్లి, చంద్రశేఖర్​ రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్ రెడ్డి, చీర్ల రాము, మోహన్​ రెడ్డి, సాయిలు యాదవ్, లతీఫ్, జక్కుల నాగన్న,​ జగదీశ్, వడ్డే కృష్ణ, వెంకటనారాయణ  పాల్గొన్నారు.