కోల్‌బెల్ట్, వెలుగు : పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మందమర్రి పాత బస్టాండ్ ఏరియాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలియో నిర్మూలనకు వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, రాష్ట్ర సర్కార్ ఫ్రీగా పంపిణీ చేస్తున్న పోలియో వ్యాక్సిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలందరికీ వ్యాక్సినేషన్చేయించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అనంతరం శాంతినగర్‌లో రూ.500 కే గ్యాస్‌సిలిండర్, గృహజ్యోతి పథకాలను, సీఐఎస్ఎఫ్బ్యారక్లో సౌతిండియా స్థాయి కరాటే పోటీలను ప్రారంభించారు. అనంతరం శ్రీకృష్ణ గార్డెన్స్‌లో బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. సింగరేణి డిస్మిస్ కార్మికులు వివిధ సమస్యలపై పలువురు ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మందమర్రి తహసీల్దార్ చంద్రశేఖర్
ట్రాన్స్‌కో ఎస్ఈ శేషారావు, డీఈ కైసర్, ఏడీ రాజశేఖర్, ఎస్ఏఓ శ్రీనివాస్, ఏఏఓ రమేశ్, ఏఈ మల్లేశం, మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, లీడర్లు దుర్గం నరేశ్, సోత్కు సుదర్శన్, ఓడ్నాల శ్రీనివాస్, గుడ్ల రమేశ్, నీలయ్య, రాంచందర్, గడ్డం రజనీ, నెరువేట్ల శ్రీనివాస్తదితరులు పాల్గొన్నారు.
నూతన వధువరులను ఆశీర్వదించిన వివేక్
మందమర్రి పట్టణంలోని మంజునాథ గార్డెన్స్‌లో ఐఎన్టీయూసీ లీడర్ ఎర్రవెల్లి శంకర్ కూతురు- మౌనిక–భరత్ వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.