చెన్నూర్–బెల్లంపల్లి రహదారికి అనుమతులివ్వండి : ఎమ్మెల్యే గడ్డం వినోద్

చెన్నూర్–బెల్లంపల్లి రహదారికి అనుమతులివ్వండి : ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి–చెన్నూర్ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ వెంటనే అనుమతులివ్వాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. 2004లో తాను కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారిని నిర్మించామని, ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. 

రహదారుల అభివృద్ధికి అనుమతులు ఇవ్వాలని అటవీ శాఖ మంత్రిని కోరారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో పోడు భూముల సమస్యల పరిష్కరించాలని కోరారు.