
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మండలం బుచ్చయ్యపల్లి నుంచి చతలాపూర్ వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు నిర్మాణం పూర్తికావడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆదివారం ఆయన ఫొటోకు బుచ్చయ్య పల్లి, దుబ్బపల్లి గ్రామాల ప్రజలు క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ నేతలు జాడి మహేశ్, చిన్న మల్లయ్య, జంబోజు రాజ్ కుమార్, కర్ణాటక ఓదెలు, బుడిమె ఓదెలు తదిత రులు పాల్గొన్నారు.