బెల్లంపల్లి, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా కృషి చేస్తున్నట్లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ తెలిపారు. బుధవారం బెల్లంపల్లి టౌన్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 5,909, రైతు భరోసాకు 51,534, కొత్త రేషన్ కార్డులకు 5,883, ఇందిరమ్మ ఇండ్లకు 39,517 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
.3ఈ పథకాలన్నీ ప్రజలకు అందేలా అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. అర్హుల లిస్టులో పేర్లు రాని వారు ఆందోళన చెందవద్దని.. గ్రామాలు, సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్త మారి సూరిబాబు, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు మునిమంద రమేశ్, నాతరి స్వామి తదితరులు పాల్గొన్నారు.