బెల్లంపల్లి రూరల్, వెలుగు : నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బెల్లంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్అన్నారు. నెన్నెల రైతు వేదికలో బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పిస్తానన్నారు. బెల్లంపల్లి అభివృద్ధి కోసం సీఎం రేవంత్రెడ్డి మొదటి విడతగా రూ.10 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. సేవ చేయడానికే వచ్చానని, బెల్లంపల్లిలోనే ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనను కలవాలని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మండలాల్లో ఉన్న నిరుపేదలకు పోడు భూముల పట్టాలు అందేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం చిన్నలంబాడి తండా,గొల్లపల్లిలో నిర్మించనున్న సీసీ రోడ్లు, సైడ్డ్రైన్ నిర్మాణాలకు భూమి పూజ చేశారు.
కొత్తూర్లో తలండి దుర్గమ్మ, రాములు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన 5 మండలాల క్రికెట్టోర్నీముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచిన జైపూర్మండలంలోని మెట్పల్లి, రన్నరప్ చిత్తాపూర్జట్లకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్కన్వీనర్నాతరి స్వామి, కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేశ్, ఎంపీటీసీలు హరీశ్గౌడ్, దాగం రమేశ్, సర్పంచ్లు తోట సుజాత, సంధ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు.