
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో తన నియోజకవర్గంలో పైసా డెవలప్‌మెంట్ కాలేదని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో జీరో అవర్‌లో ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి, మందమర్రికి నీళ్లు ఇవ్వడానికి వైఎస్సార్ హయాంలోనే పైపులు వేశారని, మిగిలిన పనులను పూర్తి చేయకుండా బీఆర్‌ఎస్ సర్కార్ పక్కన పెట్టేసిందన్నారు. నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన కోరారు.
వేమనపల్లి, నెన్నెల మండలాలతో పాటు నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని, వాటిని వెంటనే రిపేర్ చేయించాలన్నారు. అవసరమైన చోట కొత్త రోడ్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్ట్ డైరెక్షన్‌ను మార్చి బెల్లంపల్లి రైతులకు నీళ్లు ఇవ్వాలని ఆయన కోరారు.