
బెల్లంపల్లి, వెలుగు: సమ్మక్క-సారలమ్మ జాతర ప్రత్యేక బస్సులను బెల్లంపల్లి పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం జెండా ఊపి ప్రారంభిం చారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బెల్లంపల్లి నుంచి మేడారం జాతరకు 100 ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు తెలిపారు. గతేడాది బెల్లంపల్లి నుంచి మేడారంకు 60 బస్సులు నడిచాయని, వాటి సంఖ్యను ఈ భారీగా పెంచామన్నారు.
బెల్లంపల్లి బస్టాండ్ నుంచి 24 గంటలు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అవకాశాన్ని భక్తులు, మహిళలు వినియోగించుకావాలని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సులోమాన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డిపో మేనేజర్ ఏ.శ్రీధర్, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, మున్సిపల్ కమిషనర్ జి.మల్లారెడ్డి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ముచ్చర్ల మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.