అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే గడ్డం వినోద్​

అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం : ఎమ్మెల్యే గడ్డం వినోద్​

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలో అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం అందిస్తుందని ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి తెలిపారు. శుక్రవారం బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా కృషి చేస్తామని చెప్పారు.

బట్వాన్ పల్లిలో పేద ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ కార్కూరి రాంచందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సింగతి సత్యనారాయణ, సీనియర్ నేతలు మునిమంద రమేశ్, నాతరి స్వామి, దావ రమేశ్, తోకల మల్లేశ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

కాసిపేట, వెలుగు: అర్హులైన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్​ అన్నారు.  కాసిపేట మండలంలోని బుగ్గగూడెంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు.  బుగ్గగూడెం  గ్రామపంచాయతీలో  పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తున్నట్లు కలెక్టర్ దీపక్ తెలిపారు. కార్యక్రమంలో  తహసీల్దార్​ భోజన్న, ఎంపీడీఓ సత్యనారాయణ  సింగ్, కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్​ పలువురు మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.