గొల్లపల్లిలో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

గొల్లపల్లిలో కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి రూరల్, వెలుగు: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ​కొద్దిసేపు కబడ్డీ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. నెన్నెల మండలంలోని గొల్లపల్లిలో కాకా వెంకటస్వామి జ్ఞాపకార్థం కాంగ్రెస్​ పార్టీ గ్రామ అధ్యక్షుడు తమ్మినవేణి రాజేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గస్థాయి కబడ్డీ పోటీలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటగాళ్లతో కలిసి కబడ్డీ ఆడటంతో తన స్కూల్, కాలేజీ రోజులు గుర్తుకువచ్చాయన్నారు.

క్రీడాకారులకు ఎప్పుడూ తన ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. మొత్తం 26 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో మొదటి బహుమతిగా రూ.10 వేలు, రన్నరప్​కు రూ.5 వేలతో పాటు షీల్డ్​అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి ఎంపీటీసీ హరీశ్​గౌడ్, మాజీ సర్పంచ్ ​ఇందూరి శశికళ, కాంగ్రెస్​నాయకులు నేతరి స్వామి, గట్టు మల్లేశ్, మంచర్ల వెంకటేశ్, శంకరయ్య, బానేశ్, మొహిద్​ఖాన్, గోవింద్​సింగ్, మల్లాగౌడ్ పాల్గొన్నారు.

Also Read : ట్రిపుల్ ఐటీ అక్రమాలపై త్వరలో విజిలెన్స్ ఎంక్వైరీ : రామారావు పటేల్