అన్ని విషయాల్లో నైపుణ్యం ఉన్న లీడర్ జైపాల్ రెడ్డి: ఎమ్మెల్యే వివేక్

హైదరాబాద్: అన్ని విషయాల్లో మంచి నైపుణ్యం ఉన్న లీడర్ జైపాల్ రెడ్డి అని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి 83వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ పీవీఎన్ఆర్ మార్గ్‎లోని స్ఫూర్తి స్థల్‎లో ప్రభుత్వ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వివేక్ స్ఫూర్తి స్థల్‎లో జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ కేంద్రమంత్రి- జైపాల్ రెడ్డి మా నాన్న వెంకటస్వామి మంచి స్నేహితులని తెలిపారు. -

ఇద్దరు కలిసి చాలా పోరాటాలు చేశారని వివేక్ గుర్తు చేశారు. జైపాల్ రెడ్డితో కలిసి మేమంతా ప్రత్యేక తెలంగాణ కోసం హైకమాండ్‏పై ఒత్తిడి తెచ్చామని చెప్పారు. పార్లమెంట్‏లో తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతో ఎలా పాస్ చేయాలో జైపాల్ రెడ్డి స్పీకర్‎కు అడ్వైస్ ఇచ్చారని.. ఆయన- అన్ని విషయాల్లో మంచి నైపుణ్యం నాయకుడని ప్రశంసించారు. ఇవాళ జైపాల్ రెడ్డి సతీమణితో అవే విషయాలు మాట్లాడి గుర్తు చేసుకున్నామని తెలిపారు. -ప్రస్తుతం జైపాల్ రెడ్డి లేని లోటు స్పష్టంగా తెలుస్తోందన్నారు. 

ALSO READ | ఫార్ములా ఈ రేసు కేసులో ఏస్ నెక్స్ట్ కంపెనీకి ACB నోటీసులు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా జైపాల్ రెడ్డికి నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. -నాకు జైపాల్ రెడ్డి పట్ల గౌరవం ఉండేదని - ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉండేవని తెలిపారు. నిజాయతీ, నిఖార్సైన నాయకుడు జైపాల్ రెడ్డి అని ప్రశంసించారు. అనేక విషయాల్లో సిద్ధాంతపర మేం విభేదించుకునే వాళ్లమని గుర్తు చేశారు. - నేను జైపాల్ రెడ్డికి జూనియర్ కావడంతో అనేక విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. 
ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. జైపాల్ రెడ్డికి నా కుటుంబం తరుఫున, నా తరుఫున ఘన నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.